18, మార్చి 2015, బుధవారం

pattiseema project




 హటాత్తుగా ఈ పట్టిసీమ ప్రాజెక్టుని చంద్రబాబునాయుడి బుర్ర లో ప్రవేశించడానికి కారణమేమిటి?పోలవరం ప్రాజెక్టుని గాలికి వదిలేసి  దివాలాకోరుతనంతో  దీన్ని ప్రొమోట్ చేస్తున్నాడు.పట్టిసీమకి అయే 1500 కోట్లతో పోలవరం ప్రాజెక్టు కొంతవరకైనా పనిజరుగుతుంగి కదా.B.J.P.,T.D.P. కుమ్మక్కై  ఆంధ్రులని ముంచేసారు.ఎంత మోసగాళ్ళు ?సరే కాంగ్రెస్ వాళ్ళు ముందే తీరని ద్రోహం చేసారు.చివరి దాకా  ఆంధ్రులు ఈ దొంగ రాజకీ యాలతో బాధపడవలసిందేనా?

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

mahabharatam




 ఇదండీ భారతం 'గురించి రంగనాయకమ్మగారి ఇంటర్వ్యూ టీ.వీ. 9 లో చదివాను.ఆవిడ ,ఆమె మిత్రులు ఈ మధ్యనే భారతాన్ని చదివినట్లుంది.ఆవిడ చెప్పిందానిలో  నాకు కొత్త ఏమీ కనిపించలేదు.ఇప్పటికే ఎందరో పరిశోధకులు ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించి  రాసారు.ప్రపంచ  క్లాసిక్స్ లో ఒక ముఖ్యమైన  గ్రంథంగా పండితులు పరిగణించేదానిలో ఆవిడకు మెరిటేమీ కనిపించకపోవడం విచిత్రమే. మనం గుర్తించవలసిన ముఖ్యమైన విషయాలు ఇవి.1.దాదాపు 4000 సం; క్రితం రాజ్యం  కోసం  జరిగిన పెద్ద యుద్ధం  ఇందులో మూలకథ.వ్యాసుడి interpretation లో పక్షపాతం ఉండవచ్చును కాని కథాంశాలు,పాత్రల చిత్రీకరణలో ఏదీ దాచలేదు.2.అప్పటి వ్యవస్థ ఫ్యూడల్ వ్యవస్థ.రాజులు,రాజ్యాల కోసం యుద్ధాలు మామూలే.వర్ణ వ్యవస్థ కూడవాస్తవమే.మనం ఆపరిధిలోనే ఆలోచించాలి.3.రంగనాయకమ్మగారు బోధించే  మార్క్సిజం ఏమైంది?అన్నిచోట్లా విఫలమైంది కదా?4.నాకు మహాభారతంలోనచ్చిన విషయాలు;ధర్మాధర్మాల గురించి,యుద్ధము,శాంతి గురించి వాదోపవాదాలు,చర్చలు.అవి ఈ రోజుల్లో కూడా అన్వయిస్తాయి కదా.అలాగే ఆసక్తి కరమైన  పెద్ద కథ,వివిధ మనస్తత్వాల చిత్రణ కూడా ఆకర్షిస్తుంది.

13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

Dr.Kesavareddi.




 డాక్టర్ కేశవరెడ్డి గారి మరణ వార్త చదివి బాధపడ్డాను.ఆయనతో నాకు  పరిచయం లేకపోయినా, ఆయన నవలలు కొన్ని చదివాను.ప్రసిద్ధ రచయిత.''ఇంక్రెడిబుల్ గాడెస్  ',రాముడున్నాడు రాజ్యమున్నాది ' వంటి నవలలు రచించారు.ఆయన నవల 'అతడు అడవిని జయించాడు '  హెమింగ్వే నవల ' oldman and sea  'కి అనుకరణ.'మునెమ్మ ' నవల కూడా కొన్ని విమర్శలకు గురయింది.ఆయన నవలలన్నీ   పల్లెటూళ్ళ వాతావరణం  తో అతి సామాన్యుల జీవితాలకి అద్దం పడతాయి.
    వైద్యునిగా కూడా కుష్టు  రోగులకు ఆయన చేసిన సేవలు స్మరణీయమైనవి .నా సంతాపాన్ని ఈ విధంగా తెలియ జేసుకొంటున్నాను. 

9, జనవరి 2015, శుక్రవారం

pelli market




 ఆడపిల్ల పెళ్ళి గురించి మధ్యతరగతి కుటుంబాలలో బెంగపెట్టుకోవడం,నానా తంటాలు పడి ఎలాగో పెళ్ళి చేసి పెద్ద బరువు దించుకొన్నట్లు ఫీలవడం మామూలే.ఐతే ఈ మధ్య,ముఖ్యంగా ఉన్నతవిద్యావంతులైన మధ్యతరగతి కుటుంబాల్లో ఈ పరిస్థితి తిరగ బడ్డాదేమో ననిపిస్తున్నది.అమ్మాయిలు బాగా చదివి మంచి ఉద్యోగాలు  చేస్తున్నవారు తల్లిదండ్రులు చెప్పినట్లు ఎవరినైనా పెళ్ళి చేసుకోడానికి ఒప్పుకోటం లేదు.వరుడు కూడా తనపాటైనా చదువుకొని మంచి జాబ్ చేస్తూఉండాలి.వయస్సు తేడా ఎక్కువ ఉండ కూడదు,అని షరతులు పెట్టుతున్నారు.అంచేత మగవాళ్ళకి మంచి ,తగిన అమ్మాయిలు దొరకడం లేదు.నాకు తెలిసిన కొందరు పెళ్ళికొడుకులకు తగిన వధువులు దొరకడం లేదు.వాళ్ళకి  30 ఏళ్ళు దాటిపోయాయి.ఏవో కారణాలవలన,మంచి క్వాలిఫికేషన్లు  ,ఉద్యోగాలు ఉన్నా, పెళ్ళి ఆలస్యమై ఇప్పుడు కావాలన్నా పెళ్ళికుదరటం  లేదు.దీన్నిబట్టి చూస్తే మధ్యతరగతి,విద్యావంతుల్లో పెళ్ళి మార్కెట్ తిరగబడిందా అనిపిస్తున్నది.

22, డిసెంబర్ 2014, సోమవారం

20, డిసెంబర్ 2014, శనివారం

Sri.D.V.Subbarao.




 శ్రీ డి.వి.సుబ్బారావుగారి తో నాకు బాగా పరిచయముంది.ఆయన వివిధరంగాల్లో ప్రసిద్దికెక్కారు. న్యాయవాదిగా,క్రికెట్ అఫిషియల్గా,విశాఖ మేయర్గా వినుతిచెందారు.ముఖ్యంగా  మేయర్గా విశాఖను సుందరంగా అభివృద్ధి చెయ్యడంలో ఆయన కృషి ప్రశంసనీయం.వ్యక్తిగా కూడా స్నేహశీలుడు,నిజాయితీపరుడు, మేధావి .ఆయన మరణవార్త నన్ను కలచివేసింది.అయనకు నా నివాళి, శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను.ఆయన కుటుంబసభ్యులకు నా సానుభూతి  తెలుపుకొంటున్నాను.

17, డిసెంబర్ 2014, బుధవారం

premature deaths


 
శీర్షిక
--------
  ఈ మధ్య కొందరు ప్రముఖులు,సినీ,సాహితీ,రాజకీయ రంగాలలోవారు అకాల మృత్యువు బారిన పడుతున్నట్లు చదవడం కలవరపెడుతున్నది. ప్రసిద్ధులు కాకపోయినా ఇతర రంగాలలో కూడా ( వైద్యరంగంతోసహా) ఇలాగే జరుగుతున్నది.కర్మానుసారం జరుగుతుందనే  మాట పక్కన పెడితే,మానవ ప్రయత్నాలు ఏం చెయ్యాలంటే;
    1.40సం:దాటిన ప్రతి మనిషి  ఏడాదికొకసారి  మెడికల్ చెకప్ చేయించుకోవాలి.
    2.చెకప్ లో  ఏవైన,అధిక రక్తపోటు మధుమేహలక్షణాలు కనిపిస్తే  తగిన చికిత్స తీసుకోవాలి.
     3.మద్యపానం,ధూమపానం మానివేయాలి.
   4.  డబ్బు సంపాదించాలి కాని దానికోసం ఆరోగ్యాన్ని బలిపెట్టకూడదు.
      5.జీవితవిధానాన్ని life style ని తగిన విధంగా మార్చుకోవాలి. ఆహరనియంత్రణ,తగుమాత్రం వ్యాయామం  అవసరం.
     6.ముఖ్యంగా  జబ్బుని దాచుకోకూడదు.జీవితభాగస్వామి,లేక దగ్గరి బంధువుల సహకారం తీసుకోవాలి.