11, జూన్ 2013, మంగళవారం

Bezawada Rajaratnam




 1938-1948 మధ్యలో బెజవాడరాజరత్నం అనే గాయని ప్రసిద్ధిలో ఉండినది.ప్లేబ్యాక్  పాటలు పాడేది.కొన్ని సినిమాల్లో నటించి ,పాడేది.ప్రవేటురికార్డులు ,ఇచ్చి,కచేరీలు కూడా చేసేది.'దేవత ' అనే సినిమాలో,ఆమె పాడిన 'రాదే చెలీ నమ్మరాదే చెలీ  ' అనేపాట ఆ రోజుల్లో,  మారుమోగిపోయింది.1950 తర్వాత బహుశా లీల ,జిక్కి,సుశీల వంటి సింగర్సు పైకి రావడం వలన కనుమరగైపోయింది.
 '  భక్త పోతన ' లో ఇది మంచి సమయము  రారా రారా ' అనే జావళి,'మాయలోకం ' లో 'చెలియా  మనకేలనే ' అనేది చాలా బాగుంటాయి. మంచి కంఠస్వరం,సంగీత జ్ఞానము ఉండేవి.సుప్రసిద్ధ గాయనీమణులు, టంగుటూరి సూర్యకుమారి,బాలసరస్వతీదేవి ఆమె సమకాలికులు.         

bezawada rajaratnam




 1938-1948 మధ్యలో బెజవాడరాజరత్నం అనే గాయని ప్రసిద్ధిలో ఉండినది.ప్లేబ్యాక్  పాటలు పాడేది.కొన్ని సినిమాల్లో నటించి ,పాడేది.ప్రవేటురికార్డులు ,ఇచ్చి,కచేరీలు కూడా చేసేది.'దేవత ' అనే సినిమాలో,ఆమె పాడిన 'రాదే చెలీ నమ్మరాదే చెలీ  ' అనేపాట ఆ రోజుల్లో,  మారుమోగిపోయింది.1950 తర్వాత బహుశా లీల ,జిక్కి,సుశీల వంటి సింగర్సు పైకి రావడం వలన కనుమరగైపోయింది.
 '  భక్త పోతన ' లో ఇది మంచి సమయము  రారా రారా ' అనే జావళి,'మాయలోకం ' లో 'చెలియా  మనకేలనే ' అనేది చాలా బాగుంటాయి. మంచి కంఠస్వరం,సంగీత జ్ఞానము ఉండేవి.సుప్రసిద్ధ గాయనీమణులు, టంగుటూరి సూర్యకుమారి,బాలసరస్వతీదేవి ఆమె సమకాలికులు.         

S.P.B.




  ఏ గ్రేడు సంగీతదర్శకులు, రచయితలు సమకూర్చిన మంచి పాటల్నెన్నో పాడి గత 40 సంవత్సరాలుగా ఎంతో ధనమూ,కీర్తి,సంపాదించుకున్న S.P.బాలసుబ్రమణ్యంకి ఇప్పుడు బీ గ్రేడు సంగీతదర్శకులు,రచయితలని మెచ్చుకుంటూ ప్రోగ్రాములు నిర్వహించవలసిన  అవసరం ఉన్నదా?

28, మే 2013, మంగళవారం

A valuable and important book--'' uttaraandhra sphoortiprradaatalu.


 


  నా మిత్రులు కీ.శే.రామిశెట్టి వెంకట్రావు ఎంతో శ్రమించి ,చాలా కాలం సమాచారాన్ని సేకరించి రచించిన గ్రంథం '' ఉత్తరాంధ్ర స్ఫూర్తిప్రదాతలు ''.దీనిని రచించిన కొద్ది కాలానికే దురదృష్టవశాన జబ్బుచేసి ఆయన మరణించారు.'ధర్మాన ట్రస్స్టు వారు ముందుకివచ్చి ఈ పుస్తకాన్ని ప్రచురించారు.ఘనంగా శ్రీకాకుళంలో  ఆవిష్కరణ కూడా చేయించారు.
  నేను మరల ఈ పుస్తకాన్నే  విశాఖ సాహితీ అధ్వర్యంలో వైజాగ్లో విశాఖపౌరగ్రంథాలయంలో (ద్వారకానగర్) ఆవిష్కరణ చేయించాను.
  ఈ గ్రంథంలో 108 మంది ,విశాఖ,విజయనగరం, శ్రీకాకుళం,పాత గంజాం జిల్లాలకి చెందిన ప్రసిద్ధులు,మహనీయులు,వివిధరంగాలలో మార్గదర్శకులైన వారి జీవిత విశేషాలను  ప్రచురించారు.ఇందులో ప్రసిద్దులైన  కవులు,రచయితలు,జర్నలిస్టులు,రాజకీయనాయకులు,సంఘసంస్కర్తలు,విప్లవవీరులు,గాయకులు,డాక్టర్లు,సైంటిస్టులు,మొదలైన అన్నిరంగాలకూ చెందినవారిని చేర్చడమైనది.ఇది మంచి రిఫరెన్సు పుస్తకంగా వ్యక్తులదగ్గర,పరిశోధకులదగ్గర,  గ్రంథాలయాల్లోను ఉండవలసిన పుస్తకం.
 
    ప్రతులకు;-- రామిశెట్టి.భాగ్యరేఖ
                  డోర్ నం. 2-15-56
                   ఇల్లిస్ పురం వీధి
                     శ్రీకాకుళం.-532001 (ఏ.పి.)
                      --------
                   సెల్.నం. 9441707772                
                     






  

29, ఏప్రిల్ 2013, సోమవారం

Mangamma Sapatham



 


  అనుకోకుండా,నిన్న ఒక టీ.వీ. చానెల్ లో ' మంగమ్మశపథం B& W సినిమా  ' మంగమ్మ శపథం 'చూసాను.కథ కేమిటిలే జానపదకథ.కాలక్షేపానికి బాగానేఉంది. యవ్వనం తొలగని అందాల తారలు N.T.రామారావు.జమున,హీరో,హీరోయిన్లు.రామారావు రెండు పాత్రలు తండ్రీ,కొడుకూ బోనస్.  పైగా రామారావు,జమున ఇద్దరికీ మారువేషాలు!
  సంగీతం మధురంగా ఉంది.L.విజయలక్ష్మి నృత్యాలు మనోహరంగాఉన్నాయి.అంచేత చూడవచ్చును.
  ఈకథ అంతకుముందు రెండు సార్లు తీశారు.వైజయంతీమాల  తల్లి వసుంధర తో మొదటిసారి ,రెండోసారి భానుమతితోను తీసారు.పాపులర్ కథా ,స్టార్సు కాబట్టి  మూడు చిత్రాలూ విజయవంతమయాయి.   

rendu navalalu.




  ఈ మధ్య రెండు నవలలు చదివాను.రెండూ ' వాహినీ బుక్ ట్రస్ట్,హైదరబాదు 'వారు ప్రచురించినవి.' రచన 'మాసపత్రికలో ధారావాహికంగా వచ్చినవి.
   1.'తపన '-రచయిత;కాశీభట్ల వేణుగోపాల్.; వెల;రూ.60\
     చైతన్యస్రవంతి విధానంలో రచించినది.ముఖ్య పాత్ర subconscious లోని భావతరంగాలని పైకి వెలిబుచ్చుతూ ,దాచకుండా రాసినదీ.4,5,రోజులలో భార్యాభర్తల మధ్య జరిగిన సంఘటనలనీ,వారి సంబంధాలనీ యథాతథంగా చిత్రించారు. కాని, వారిద్దరికీ  ఎందుకు,వైమనస్యమో,ద్వేషమో అర్థంకాదు.అందుకు బలమైన కారణాలు కనిపించవు.చివరకు,భార్య  గర్భవతి ఐందని తెలియగానే మళ్ళీ పరస్పరం సామరస్యం,అనురాగమూ కలుగుతాయి.ఇందులో హీరో తాగుబోతు,వ్యభిచారి.కాశీభట్ల నవలల్లో ఈ గుణాలు ఎక్కువగా కనిపిస్తాయి.బహుశా,ఇవి లోకంలో సహజమూ,సామాన్యమూ ఐపోయాయి కాబట్టి తప్పులేదని రచయిత ఉద్దేశం కావచ్చును.
  ఈ నవలకు 1999 లో 'తానా-స్వాతి ' నవలల పోటీలో లక్ష రూపాయలు బహుమతి వచ్చిందట.
   2.ఐ.సి.సి.యు.(I.C.C.U.) రచన;డా.చిత్తర్వు మధు.వెల 100\ రూ.
    ఇది కూడా 'రచన ' పత్రికలో సీరియల్ గా వచ్చింది.మెడికల్ థ్రిల్లర్ genre  కిందికి వస్తుంది.ఒక పెద్ద హాస్పటల్ లో గుండెజబ్బుల కు నిర్దేశించిన ఎమర్జెన్సీ I.C.C.U. వార్డులో ఒక నిపుణుడు  గుండె చలనాల్ని సరిగా నియంత్రించే  పేస్ మేకర్ pace maker ' అనే పరికరాన్ని  అమర్చుతుంటాడు.ఇది సామాన్యంగా జరిగే ప్రక్రియే.కాని దుష్టస్వభావమూ, దురాశా ,అమితమైన ambition కల అతదు ఆ పరికరంలోనే రోగి మెదడుని కంట్రోలు చేసే మరొక చిన్న పరికరాన్ని కూడా చేర్చి దాని ద్వారా ధనవంతులైన రోగుల నుంచి  డబ్బు సంపాదిస్తాడు.అంతటితో ఆగక తన దగ్గర గుండె జబ్బు కనివచ్చిన రాష్ట్ర ముఖ్య మంత్రి ని కూడా ఆ పరికరంతో కంట్రోలు చేస్తాడు.ఈ లోగా కొత్తగాచేరిన మంచి డాక్టర్ అనుమానించి  ,పరిశోధించి ఆ కుట్రను భగ్నం చేస్తాడు.విలన్ డాక్టర్ అగ్నిప్రమాదంలో చనిపోతాడు.
     ఉత్కంఠతో చకచకా సాగే నవల ,ఆసక్తితో చదివిస్తుంది.రచయిత డాక్టర్ కాబట్టి మెడికల్ నేపథ్యాన్ని బాగా చిత్రింప గలిగారు.ఇంగ్లీషులో వచ్చిన రాబిన్ కుక్  మెడికల్ థ్రిల్లర్లని తలపింపజేస్తుంది.



 
       

23, ఏప్రిల్ 2013, మంగళవారం



 


   వరచిరకర కిరణాభరణా,మణిదీపిత మకుటాభరణా
     చంద్రాతపకారణ, ఘనతిమిరహరణా
   జీవనకాలాంకిత మేఘావరణా,జలనిధిధనశోషణ
      అణుశక్తిస్థలభీషణ,సర్వగ్రహవర్తుల చారణ
   భువనైకశరణా ,కృత జననమరణా
     సకలజన చేతనపోషణ
   సురనరమునివర  వందితచరణా
     జయసర్వాత్మక,జయ అరుణారుణ
   జయజయ ప్రత్యక్ష  శ్రీమన్నారాయణ.