ఈమధ్య ఒక వారపత్రికలో వరుసగా తెలంగాణలో ఘధీల గురించి వ్యాసాలూ వస్తున్నాయి.ఇవి కోటలంత పెద్దవీ,గట్టివీ కాదు .మామూలు ఇళ్ళ వంటివీ కాదు.చిన్న జాగీర్దార్లు ,దొరలూ కట్టించుకోన్నవి.వీటిని కోస్తా జిల్లాలలో దేవిడీలని అంటారు.ఇవి కొన్ని మాత్రం బాగున్నవి.చాలా శిధిలం ఔతున్నవి.౧౦౦ సం;దాటిన కట్టడాలు హీరిటాజ్బిల్డింగుల కింద వస్తాయి.వాటిని యజమానులు బాగుచేసి కాపాడాలి.ప్రభుత్వం ,ప్రాజలు కూడా పూనుకోవాలి ఈ వ్యాస కర్తలకు నేను ఒక సూచనా చేశాను ఈ భావనలు మంచి ఫోటోలు తీసి ఎన్లార్జ్ చేసి హైదరాబాద్ ఆర్ట్ గాలరీ లో ప్రదర్శిస్తే మంచిది అందరికి తెలుస్తుంది ఇంటాక్ సంస్థ వారి సహాయం కూడా తీసుకో వచ్చును
27, సెప్టెంబర్ 2011, మంగళవారం
25, సెప్టెంబర్ 2011, ఆదివారం
my motto
' నా తెలంగాణ కోటి రత్నాల వీణ '
రత్న ఖచిత కిరీటమ్ము రాయసీమ
దివ్య కాంచన రథము మా తీర భూమి
వెలుగు ముప్పేట హారమ్ము తెలుగునాడు.
పై పద్యంలో మొదటి పాదం అందరికీ తెలిసిన దాశరథి పద్యంలోనిది.మిగిలిన మూడు పాదాలూ నేను వ్రాసినవి.పై పద్యమే నా
నిశ్చిత అభిప్రాయం.నేను అంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలనూ,అన్ని జిల్లాలనూ ప్రేమిస్తాను.ఆంధ్రులు అంటే అన్ని జిల్లాలవారూ. అజ్ఞానం వలననో దురుద్దేశం తోనో ఈ విషయం సామాన్యులకు కవులు, రచయితలు,పత్రికల వారూ,టీ.వీ,ల వారూ ఎందుకు చెప్పడం లేదో తెలియదు.ఇప్పటి ఉద్రిక్త వాతావరణంలో ఇంతకన్న వ్రాయ దలచుకో లేదు.
20, సెప్టెంబర్ 2011, మంగళవారం
okageyam-niraasa
భిక్షకుడొకడిని-బీద అరుపులవాణ్ణి
వీధుల కూడలిలో -వెళ్తూ చూశాను
భయపడకు బీదల-ప్రభుత్వం వస్తుంది
బాగుపడుతుంది నీజీవితం -భరోసా ఇచ్చాడొక సోషలిస్ట్
మురిగిపోయిన వ్యవస్థే - మూలకారణం
తిరగబడమన్నాడు- తీవ్రవాది ఒకడు
గతజన్మలో పాపాలే-కారణం నీ స్థితికి
ప్రాయశ్చిత్తం చేసుకో -పదమన్నాడు మతగురువు
బలంగావున్నావు కదా- పనిచేసుకోలేవా
కష్టపడుపొమ్మని- కసిరాడు కేపిటలిస్ట్
అమ్మాయిల అందం - ఆరాధించే అబ్బాయి
ఏమిటి యీ న్యూసెన్స్- ఇక్కడనుండి పొమ్మన్నాడు
పదిరూపాయలు చేరితే- పట్టెడన్నం తినాలన్న
బిచ్చగానికి నిరాశే- మిగిలింది చివరకి .
oka padyam,kalingaseema
వంశధారాతీర వసుమతి యంతయు
ప్రాక్తన నిర్మాణ భరిత భూమి
బౌద్ధచైత్యవిహార భవ్యవిద్యాలయ
సకలదేశాగమ చ్చాత్రవితతి
శత్రుభీకర మహాసామ్రాజ్య విస్తృత
సేనానికరముల చెలగునేల
సాగరాంతర వణిక్ సంపద్విభవార్జ
నమున లక్ష్మీ సదనమ్ము గాగ
నగరికటకశ్రీకాళింగ నగరప్రముఖ
శ్రీముఖక్షేత్ర దంతపురీమహేంద్ర
శైలశాలిహుండాది ప్రశస్త దివ్య
క్షేత్రముల నలరారె నీ సీమ మున్ను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)