11, డిసెంబర్ 2012, మంగళవారం

కమనీయం: Backwardness

కమనీయం: Backwardnesscpbrownsevasamithi@yahoo.com

10, డిసెంబర్ 2012, సోమవారం

Backwardness




 వెనకబడిన వాళ్ళం,వెనకబడ్డ ప్రాంతం అని చెప్పుకోడం ఇప్పుడు ఒక అలవాటయింది.ఉత్తరాంధ్ర(నాది ఆ  ప్రాంతమే ఐనా )బాగా వెనకబడింది అంటుంటారు.కాని నేను అలా అనుకోను.ఈ ప్రాంతంలో  వర్షాలు బాగానే పడతాయి.ఏరులు,వాగులు చాలాఉన్నవి.పంటలు బాగానే పండు తాయి.ఇటీవల విద్యాలయాలు,ఆస్పత్రులు ,బాగావృద్ధిచెందాయి.పర్యాటక రంగం కూడా పెరుగుతున్నాది.మధ్యకోస్తా ఆంధ్రులు ఇక్కడ కొండలు,అడవులు ఉండటం చేత మీరు వెనకబడ్డారని అంటారు.అవి ఉండటం అదృష్టం,అందం.అడవులు ,కొండలు లేని పశ్చిమ గోదావరి,కృష్ణా ,గుంటూరు జిల్లాలకన్నా ఉత్తరాంధ్ర జిల్లాలు  అందంగాఉంటాయి.గణాంకాల ప్రకారం కూడా అంత పెద్ద తేడా ఏమీ లేదు.తెలంగాణా జిల్లాలు కూడా (కొంచెం తరతమ భేదాలు తప్పించి ) వెనకబడలేదని నా అభిప్రాయం.
  

7, డిసెంబర్ 2012, శుక్రవారం

GLOBALIZATION (contd.)





  ఐతే ప్రపంచీకరణ వలన నష్టాలు ,లాభాలు ఉన్నాయి.
    నష్టాలు;-1.దేశీయ పరిశ్రమలు దెబ్బతినడం.2.ఆర్థికంగా విదేశాలపైన ఆధారపడవలసి రావడం.3.విదేశ భాషాసంస్కృతుల కు లొంగిపోవడ4.ఇతరదేశాల్లో కలిగే ఆర్థిక, రాజకీయ సంక్షోభాల వలన మన ప్రయోజనాలు దెబ్బతినడం.ఇటువంటి నష్టాలు ఉన్నాయి.
 లాభాలు;- 1.మన ఎగుమతులవలన ఆర్థికలాభం.2.ఇతరదేశాల్లో ఉద్యోగాలు,వ్యాపారాలు సంపాదించడం.3.సాంకేతిక,వైజ్ఞానిక రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాల సహాయసహకారాలు.4.ఇతర దేశాల్ల్లో మనం పలుకుబడి,వనరులు ,ముడిపదార్థాలు సంపాదించుకోవడం వంటి లాభాలు కూడా ఉన్నాయి .
   మనం గుర్తించవలసిన అంశం ; పూర్వం లాగా మనదేశం ఇప్పుడు బలహీనమైన,పేదదేశం కాదు.అభివృద్ధి పథంలో పయనిస్తూ బలీయమౌతున్న దేశం. మనకంపెనీలు ఇతరదేశాల్లో విస్తరిస్తున్నాయి.అక్కడ మనవాళ్ళు ఆస్తిపాస్తులు సంపాదించుకొంటున్నారు.మిలిటరీ, ఆర్థికసంపత్తిలో ,మనదేశం p.p.p. ప్రకారం 4వస్థానంలో ఉంది.అందువలన ప్రపంచీకరణ అంటే భయపడనక్కరలేదు.అందులోఉన్న మంచి ని తీసుకొని ,చెడ్డని వదిలివేయడం నేర్చుకొంటే సరిపోతుంది. 

Globalization





  ఇటీవలకాలంలో ప్రపంచీకరణ(globalization) గురించి ఎక్కువగా వినిపిస్తున్నది.తీవ్ర వాదోపవాదాలు చెలరేగుతున్నాయి.ఇప్పుడు ఎక్కువైనా పూర్వకాలమ్నుంచి ఈ ప్రక్రియ కొంత జరుగుతూనేఉన్నది.ఈ మాటకి అర్థం ఏమిటి?ఒక్క ఆర్థికవిషయాల్లోనే కాదు; రాజకీయ,సాంఘిక,భాషా సాంస్కృతిక వ్యవహారాలన్నిటి లోను దేశాల మధ్య పరస్పర ప్రభావము, ఆధిక్యము,సమ్మిశ్రమము జరగడమే.రోమన్ సామ్రాజ్యకాలంలో దాని ప్రభావం చాలా దేశాలపై పడినది.మనదెశ ప్రభావం తూర్పు,ఆగ్నేయ ఆసియా దేశాలలో బాగా కనిపిస్తుంది.16వ శతాబ్దమ్నుంచి పశ్చిమ యూరప్  సామ్రాజ్యాల విస్తరణ వలన ఆసియా,ఆఫ్రికా ,అమెరికా ఖండాలలో యూరప్ ప్రభావం వాటిపై పూర్తిగా పడింది.అంతకు ముందు ఇస్లాం ద్వారా ఆరబ్ మత,భాషా ,సంస్కృతుల ప్రభావం అట్లాంటిక్ నుంచి పసిఫిక్ మహాసముద్రం దాకా వ్యాపించింది కదా.ఆధునికవిజ్ఞానం,పరికరాలవలన యీ ప్రపంచీకరణ అతివేగంగా జరుగుతున్నది .(to be continued) .

30, నవంబర్ 2012, శుక్రవారం

S.V.B.C.CHANNEL


  
 ఈ మధ్య శ్రీవెంకటేశ్వర S.V.B.C.CHANNELప్రసారాలని వీక్షించారా?అవి ఎంత అధ్వాన్నంగా ప్రసారమవుతున్నవో గమనించారా?అందులో అంశాలగురించికాదు.అవిబాగానేఉంటున్నాయి.ప్రసారపద్ధతిగురించే నా ఫిర్యాదు.T.T.D. ఇంజనీర్లు,టెక్నీషియన్లు ఇప్పటికైనా ఈ తప్పుల్ని సరిచేస్తారని ఆశించవచ్చా? 

13, నవంబర్ 2012, మంగళవారం

Posting from android tablet

From now onwrds post fromandroid

14, అక్టోబర్ 2012, ఆదివారం

Wuthering heights-a novel.




 ఎమిలీబ్రాంటి =బ్రాంటీ సోదరీమణుల్లో రెండవది.ముగ్గురూ రచయిత్రులే.
  జననం;1818;మరణం;1848.
 ఆ రోజుల్లో ఇంగ్లాండ్ వంటి దేశాల్లో క్షయ వ్యాధి ఎక్కువగా ఉండేది.కీట్స్ ,వర్జీనియావుల్ఫ్ ఆ వ్యాధి తోనే మరణించారు.ఎమిలీ కూడా చిన్నవయసులోనే క్షయతో మరణించింది.ఆమె రచించిన ' వుదరింగ్ హైట్స్ ' అనే నవల ప్రసిద్ధమైనది.ఇతర రచనలు అంతగా లభ్యం కాలేదు.జేన్ ఆస్టిన్ నవలల తర్వాత అంత ప్రసిద్ధమైన నవలా(స్త్రీలు రచించినవి )లేదు.ఇప్పటికీ పాఠకులు ఇస్టపడేది.
 ఐతే ఈ నవలలో విశిష్టత ఏమిటి?తమ యింట్లో పెరిగిన జిప్సీ కుర్రవానికీ,  యింటి యజమాని కూతురికీ ప్రణయం ప్రధానాంశం.ఆ యజమాని కొడుకుకీ జిప్సీ కుర్రవానికీ మధ్య వైరం మరొక ముఖ్యమైన అంశం.కేథరిన్ ఎర్న్ షా (హీరోయిన్ ) హీథ్ క్లిఫ్ (జిప్సీ) ప్రేమ  సఫలం కాదు.కేథరిన్ ఇంకొకరిని వివాహం చేసుకుంటుంది.ఈ నవలలో ఎవరూ ఉన్నతమైన ,ఉదారమైన భావాలు,ప్రవర్తన కలిగి వుండరు.పగ,అసూయ,వైరం  ఎక్కువగా కనిపిస్తాయి.ఐతే తీవ్రమైన భావోద్వేగాలు,ఆవేశాలు,తీవ్రవాంచలు,(passions) ఎక్కువగా నవలలో ఆవహించి ఉంటాయి.బహుశా అవే ఈ నవలకి ఆకర్షణలు అయివుంటాయి.
  ఈ నవలని పలువిధాలుగా రివ్యూ చెసారు.విమర్శించారు.మార్క్సిస్టు దృక్పథం తో ,స్త్రీవాద దృక్పథంతో సమీక్షించారు.మనస్తత్వ పరిశీలనతో పరిశోధించారు.కాని ఏకాభిప్రాయం రాలేదు.మానవుల్లోని చీకటికోణాలని చూపించేనవల అంటారు.మీరే చదివి అభిప్రాయం ఏర్పరచుకొండి.నేను మొదటిసారి విద్యార్థి దశలో చదివాను. బాగా అర్థం కాలేదు.రెండోసారి చదివినప్పుడు అర్థం చేసుకొన్నాను,It is a dark novel.