17, జూన్ 2011, శుక్రవారం

శ్రీకాకుళం - శ్రీకూర్మనాథ స్వామి దేవాలయం

www.srikurmamtemple.com  www.srikurmamtemple.blogspot.com
శ్రీ కూర్మం దేవాలయం  చాలాప్రాచీన మైనది.విష్ణు,పద్మ,పురాణాల్లో దీని ప్రస్తావన ఉన్నది, చారిత్రకంగా ఇప్పటి ఆలయం పన్నెండవ శతాబ్దంలో  నిర్మించబడినది.కళింగరాజులు ,అనంతవర్మ చోడ గంగ దేవ ,( కీ.శ1134)అనంగ భీమ( కీ.శ1211)రాజుల శాసనాలు ఉన్నవి.ఈ దేవాలయాన్ని ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు ,చైతన్య ప్రభు,దర్శించారని అంటారు.ఈ ఆలయం కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నది.
  
 1.విష్ణుమూర్తి కూర్మావతారానికి  దేశంలో ఇదొక్కటే ఆలయం.
 2. ఒక్క ఆలయానికే .రెండు ధ్వజ స్తంభాలు ఇక్కడే .ఉన్నాయి.
 3 దుర్గాదేవిఇక్కడ వైష్ణవి రూపంలో ఉన్నది
.4. .కుడ్య చిత్రాలు ఉన్నకొద్ది దేవాలయాల్లో ఇది ఒకటి
.5. శివాలయాన్ని వైష్ణవ ఆలయంగా మార్చేరని ఒక వాదన   ఉన్నది. శివాలయంలో వలెనె దేవుడికి ప్రతి రోజు అభిషేకం జరుగుతుంది
.6..తాబేలు ఆకారంలో మూలవిరాట్టు ఒక పక్కగా ఉంటుంది. నిర్మాణము,శిల్పము. : ఆలయం కళింగ,దాక్షిణాత్య పద్ధతుల మేళవింపుతో నిర్మించబడినది.ప్రదక్షిణ పథంలో నూటఎనిమిది స్తంభాలు అలంకరణ ,శిల్పంలో ఒకదానితో  మరొకటి పోలిక లేకుండాచక్కగా  నిర్మించారు.స్తంభాలపైన, గోపురంపైన వివిధదేవతలు ,పురాణ కథలు,    లతలు, పుష్పాలు మనోహరంగా చెక్కబడిఉన్నవి.  గర్భ గుడి ముందు భోగ మంటపం, ఆస్థాన మంటపం, ఉన్నవి.గర్భగుడి మీద గోపురం ఐదు అంతస్తులుగా ఉన్నది.గుడి ముందు ఒకటి ,వెనుక మరొకటి ధ్వజస్తంభాలు ఉన్నవి.రెండవది పాడయిపొతే సినిమా నటుడు శ్రీహరి మళ్ళీ ప్రతిష్ఠించారుట.

శ్రీ కూర్మం ఫొటోలు కొన్ని చూడండి:


    ఈ ఆలయం లో గోడల మీద అనేక గాథలు చిత్రింపబడి ఉన్నాయి.కాని కాలక్రమంలో అవి  మాసిపోయిఉన్నవి .కృష్ణం వందే జగద్గురుం సంస్థ వారు విష్ణు గాథలను చక్కటి ఆయిల్  పెయింటింగ్స్  వేయించి గోడల కు తగిలించారు.ఇంకా అనేక విధాలుగా ఈ సంస్థవారు,దేవ దాయ  శాఖ వారు,ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
   ఈ దేవాలయం తప్పక చూడ వలసినవాటిలో ఒకటి.  

16, జూన్ 2011, గురువారం

HelveTia

హెల్వెటియా,హెల్వెటియా!-చెల్వములొలికే స్వర్ణమయా,
ఇందుశీతల మందమారుత-మెందుచూసినకనువిందు చేసే
సుందరారణ్యసీమల-అందముల ప్రోవీ హెల్వెటియా
నీహారచేలావృతవిహారసీమల
రజతా అ రాజిత భ్రాజితో న్నత-నగరాజ భూమీ 
హెల్వెటియా 
అరుణ హరిత పత్ర పాళీ -భరిత ఘన భూరుహాళీ 
సుమనికుంజప్రసవ -సుగంధ మత్తాళిపాళీ 
సరసిజరభసరసీవినోద-జలవిహగాళీ
 కాంచనోపమకబరీభరీ - కమనీయబాలా 
రమణీమణీ - హెల్వెటియా ,హెల్వెటియా!     
 (హెల్వెటియా స్విట్జెర్ లాండ్ కి మరొ పేరు )  

10, జూన్ 2011, శుక్రవారం

స్వర్గీయ నటరాజ రామ కృష్ణ గారికి నివాళి

శ్రీ నటరాజ రామకృష్ణ గారి గురించి రాయడానికి నాకు నృత్యం గురించి ఎక్కువగా తెలియదు. కాని ఒకటి ,రెండు 
సంగతులు మాత్రం రాస్తాను .నేను మెడికల్ కాలేజిలో చదివేటప్పుడు ,మా క్లాస్మేట్ చలపతిరావు ఆయన దగ్గర 
నృత్యం నేర్చుకొని ,కాలేజి ఫంక్షన్ లో ఆడవేషంతో "మొక్కజొన్నతోటలో"పాట అభినయించేవాడు.(1954 -55).
అప్పటికి మాస్టారికి ఇంకా అంతప్రసిద్ధి లేదు. వైజాగ్ లో ఉండేవారు.తరవాత 1980 ప్రాంతంలో మా అమ్మాయి అరంగేట్రం కి  ఆయన రాలేకపోయినా, ఆశీర్వాదం పంపించేరు.మా మేనకోడలు ఆయన దగ్గర నృత్యం అభ్యసించింది.
ప్రఖ్యాత నర్తకులు ,పత్రికలూ, టి.వి.చానల్సు, ఆయనగురించి చెప్పినవి అంతాచూసి, చదివి ఉంటారు. కూచిపూడి
దేవదాసి,పేరిణి నృత్యాలకి ఆయన చేసినసేవ ,ఆంధ్ర నాట్యానికి ఆయన తెచ్చిన గుర్తింపు చిరస్మరణీయం. తెలుగు నటరాజుకు నివాళులు అర్పిస్తున్నాను.    

 రమణారావు.ముద్దు

2, జూన్ 2011, గురువారం

విశ్వనాథ వారి గురించి ... మరి కొంత

విశ్వనాథవారి గురించి క్లుప్తంగా :--౧.వేయిపడగలు నవల పూర్తిగా చదివాను .౨.రచయిత ప్రతిభను మెచ్చుకోవాలంటే 
 అతని లేక ఆమె అభిప్రాయాలుతో ఏకీభవించనవసరం లేదు. ౩.విశ్వనాథ  సాంప్రదాయక ,ఫ్యూడల్ సమాజాన్ని
 గ్రామీణ జీవనవిధానాన్ని సమర్థించిన విషయంమనకు తెలిసిందే.౪.ఏవ్యవస్థలోనైనాకొంత మంచి,కొంతచెడు
ఉంటుంది.౫..వేయిపడగలు నవల గోప్పతనమేమంటే ఏబయి,అరవయి  సం:లో మన దేశంలో జరిగిన మార్పులు ,
సంఘటనలు ,ఒక గ్రామం చరిత్రలో ఇమిడ్చి వర్ణించాడు. విశాలమైన కేన్వాస్ మీద సంఘాన్ని చిత్రించారు.
 ఎన్నో మౌలిక విషయాలు ఇందులో చర్చకు వస్తాయి. ఇంకాభాషా  ,వర్ణనలు గొప్పగా ఉంటాయి.
 ౬.చెలియలికట్టలో స్త్రీ పురుష సంబంధాల్లో కొన్ని హద్దులను దాటకూడదని నిరూపిస్తాడు.౭.ఏకవీర ఒక మనోహరమైన 
 ప్రణయకావ్యం..౮.హాహాహూహూ ,అనే గంధర్వుడు రెక్కలకి దెబ్బ తగిలి భూమిమీద పడినాక జరిగిన ఘటనలు 
 తమాషాగా వర్ణించారు.వేటేరినరీసైన్సు రహస్యాలన్నీఈ నవల లో ఉంటాయి.౯.విశ్వనాధవారి విశ్వరూపంలో 
 ఈ నవలలు ఒక భాగం మాత్రమె.అయన కవిత్వం గురించి ఇప్పుడు ప్రస్తావించడం లేదు.౧౦.చలంరచనలనీ,  విశ్వనాధ 
 రచనలనీ పోల్చలేము.వేటిగోప్పవాటిదే.౧౧.పురానవైరగ్రన్ధమాలలో మరుగునపడ్డ ప్రాచీన భారతచరిత్ర గురించి ,
 చరిత్ర, కల్పనా మేళవించి రచించిన నవలామాలిక.
  చలం స్త్రీ విముక్తికోసం ,సమాజంలో ప్రేమ ,కొత్తదనం ,సమానత్వం కోసం రచనలు సాగించాడు. విశ్వనాధ 
 మన సంస్కృతిలో గొప్పతనం ,శాశ్వతమైన విలువల గురించి రాసాడు. ====రమణారావు .ముద్దు 

మరొక పద్యం



జేగంట 
---------        శారద విభాత మారుత శైత్య వీచి 
                    పతిత పారిజాతకుసుమ పరిమళమ్ము 
                    గ్రామ మందిరమందు జేగంట  మ్రోత
                    హృదయమున మధు రసమావహించే నిపుడు.
                            -------------------------------------


armed,and dangerous

మారణాయుధాలు ;
-------------------------------------టీ.వీ.లో వార్తలుచూస్తుంటే తరుచు రెండు ముఠాలు కొత్త కొత్త   ఆయుధాలతో 
 పోరాడుతూ ఒకరినొకరు నాశనం చేసుకొంటూ ఉండటం కనిపిస్తుంది. వీళ్ళకీ ఆయుధాలన్నీ ఎలా వస్తున్నాయని 
నాకు అనుమానం కలుగుతుంది.అమెరికాయే  మిగతా పెద్ద దేశాలకన్నాఎక్కువ సప్లయిచే  స్తున్నాది. ఇందులో 
రహస్యమేమీ లేదు.కాని అభిజ్న వర్గాల ద్వారా తెలుసుకొన్న రహస్యమేమంటే ;పెంటగాన్ ఏనగరాన్నైనా పూర్తిగా 
నాశనం చేసే ఆయుధాల్ని అమ్ముతుంది.స్టేట్ డిపార్ట్మెంట్ కర్తవ్యమేమంటే ఆ మంటల్ని ఆర్పడం.ప్రభుత్వంలోనే 
భాగమైన ఈ రెండు శాఖలూ పరస్పర విరుద్ధంగా పని చేస్తూఉంటాయి !వీళ్ళమద్యసంభాషణ ఇలాఉంటుందని 
ఊహించి రాస్తున్నాను. 
       విదేశాంగ శాఖ డేప్యుతి సెక్రెటరి (స్టేట్ డిపార్ట్మెంట్)--"దిన్డిమారిపబ్లిక్ లో ప్రత్యర్థి వర్గాలమధ్య మేము శాంతి 
స్థాపన కోసం ప్రయత్నిస్తున్నాము.ఇరు వర్గాల దగ్గరా ఆయుధాలుఐపోవస్థాపన చ్చాయి కాబట్టి అందరూ శాంతి 
సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీరు దిన్డిమా ప్రభుత్వ సైన్యానికీశాంతి  రెండు మిలియన్ డాలర్ల  బాంబులు  
 మేషిన్గాన్నులుఅమ్మబోతున్నారట.ఇలా ఐతే ఎలా ?మూడేళ్ళనుంచిమేము సాంతిస్తాపనకోసం ప్రయత్నం 
 చేస్తున్నాము.ఇద్దరిదగ్గర ఆయుధాలు ఖర్చాయి పోడంచేత ఇప్పుడు సంధికి ఒప్పుకోన్నారు.మీరిలాచేస్తే ఎలా?
 సై.డి."ఇంకా నయం .చిన్న అణు అస్త్రాలు కావాలన్నారు.మనపాలసీకి విరుద్ధం కాబట్టి గంసు, బాంబ్స్ మాత్రం ఇచ్చాము."-వి.డి. "ఐతే అక్కడ మళ్ళీ భాగ్గుమనిపిస్తారా ?"
సై.డి. ""మీ శాంతి ప్రయత్నాలకి అడ్డు రాము. మా పని మేము చేసుకుపోతూ ఉంటాము.
మాదగ్గరఆయుధాలన్నీ అమ్మడం  ,కొత్తవి తయారు చేసుకోడం మావిధానం.లేకపోతె అమెరికా థర్డ్ రేట్ 
పవర్ అయిపోదూ?'-వి.డి. "ఇటీవల మీరు వెస్ట్ ఆసియాలో ఎక్కువ విలువైన ఆయుధాలు, పరికరాలు, 
ఎందుకమ్మారు?అక్కడ ఉద్రిక్తత పెరిగిపోతుంది కదా."
సై.డి.-"తెలివితక్కువ ప్రశ్నలు వెయ్యకండి. ఎవరెక్కువ నగదు ఇవ్వగలిగితే వారికి అమ్మడమే మా విధానం.'
 "ఇరాక్ కి కూడానా?'-'వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి."
 వి.డి.సె."మేమిక్కడ అనుకొంటున్నాము.చైనాకి ఫైటర్విమానాలుఅమ్మితే ఇన్దియాతో మన సంబంధాలు 
 దెబ్బతిన వచ్చును. చివరికి మనం కలగజేసుకొని బంగ్లాదేశ్కి మన సైన్యాలు పంపించ వలసి రావచ్చును 
".మీరేమనుకొన్నా ఫరవా లేదు.మన ఆయుధాలు కొనుక్కొనే వాళ్ళే మన మిత్రులు.వాళ్ళకే మనం సాయం 
 చెయ్యాలి.ఎదటి వాళ్లకి కాదు.'--- "ఎదటి వాళ్ళంటే ఎవరు ?"
 "గతంలో మనదdగ్గర హెలికాప్టర్లు కొనుక్కొన్నవాళ్ళు!"
     (ఆర్ట్ బుఖ్ వాల్డ్ "ఆర్మ్డ్ అండ్ డేంజరస్ "ని అనుసరించి.)

1, జూన్ 2011, బుధవారం

విశ్వనాథ వారి కల్పనా శక్తి


విశ్వనాథ వారు ఎప్పుడూ వివాదాస్పదులే.కాని ఆయన కల్పనాశక్తి,పాండిత్యం,కవితా  ప్రభలకు జోహార్లు.హాహాహూహూ చాలా కాలం కిందటే చదివాను.వేయిపడగలు, చెలియలికట్ట. ఏకవీర ;ఇంకా దొరికితే పురాణ వైర గ్రంథమాలాలు   నవలలు చదవండి