11, మే 2011, బుధవారం

chalamandhiswritings--cntd.

ప్రవీన్సర్మగారూ,సంఘం  మారలేదని చెప్పలేము.౧.స్త్రీ విద్య బాగా ఎక్కువైంది. ౨.అమ్మాయిలుఇష్టమైతేనే పెళ్ళికి 
ఒప్పుకొంటున్నారు.౩.విడాకులు బాగా ఎక్కువైనవి.౪.నాకు తెలిసి కొందరు సహవాసం కూడా ,(పెళ్లి లేకుండా )
చేస్తున్నారు. ౪.సమాజం పూర్తిగా ఎప్పుడూ మారదు ౫.ఇప్పటికీ మెజారిటీకి స్వేచ్చా ప్రణయంఅంటే ఇష్టము ఉండదు.
. .          రమణారావు.ముద్దు 

chalamandhiswritings--cntd.

ప్రవీన్సర్మగారూ,సంఘం  మారలేదని చెప్పలేము.౧.స్త్రీ విద్య బాగా ఎక్కువైంది. ౨.అమ్మాయిలుఇష్టమైతేనే పెళ్ళికి 
ఒప్పుకొంటున్నారు.౩.విడాకులు బాగా ఎక్కువైనవి.౪.నాకు తెలిసి కొందరు సహవాసం కూడా ,(పెళ్లి లేకుండా )
చేస్తున్నారు. ౪.సమాజం పూర్తిగా ఎప్పుడూ మారదు ౫.ఇప్పటికీ మెజారిటీకి స్వేచ్చా ప్రణయంఅంటే ఇష్టము ఉండదు.
. .          రమణారావు.ముద్దు 

10, మే 2011, మంగళవారం

చలం నవలలు , దృక్పథాలు

చలం నవలల గురించి చాలామంది రాసేవున్నారు. అయినా మళ్ళీ ఎవరైనా రాయవచ్చును. మెహెర్, సంహిత ,అనేవారు ఇప్పుడు బాగా విశ్లేషించి రాస్తున్నారు.నేను నా పుస్తకాల్లో శశిరేఖ, మైదానం నవలల గురించి వ్యాఖ్యానించాను .ససిరేఖలో ఆయన శైలి పరిణత పొందలేదు. గ్రాంధికానికి దగ్గరలో ఉంటుందిచలం నాయికల జీవితం 
మామూలుగా విషాదాంతంగా ముగుస్తుంది.వీల్లెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని కోపం వస్తుంది.స్త్రీవాదం ,అలాంటి 
రచనలు తెలుగులో రాకముందే ,ఎనభై సం /ముందే చలం విప్లవాత్మక రచనలు చేసి మధ్య తరగతి ఆలోచనలను 
ప్రభావితం చేసాడుఆయన పెళ్లి,బడి, వ్యవస్థలకు . వ్యతిరేకి.మనం ఇప్పుడా భావాలను వ్యతిరేకిన్చావచ్చునుచలం
నవలలు,కథలు, ద్వారా పరోక్షంగా కాకుండా ,ఆయన రాసిన  స్త్రీ అనే వ్యాససంపుటి చదివితే తెలుస్తుంది. స్త్రీల
జీవితాలూ,సమస్యలగురించి చర్చించాడు.ఆర్ధిక, సాంఘిక, వైవాహిక ,సెక్సు,విషయాలన్నిటి మీదా స్పష్టంగా తన 
అభిప్రాయాలన్నీ విసదీకరించాడు. కొన్ని పరిష్కారాలు సూచించాడు. ------రమణారావు.ముద్దు 

9, మే 2011, సోమవారం

కాశ్మీర్

ఇండియన్ మినర్వాగారు, కాస్మీరుని మనం ఎట్టి పరిస్థితుల్లోను వదలకూడదు.౧చారిత్రక కారణాలు.౨.దేశవిభజన 
సమయంలో కాశ్మీర్ అప్పటి శరతులప్రకారం చట్టబద్ధంగా భారత్లో చేరింది. ౩ప్రజాస్వామికమ్గా ఎన్నికలు,పరిపాలన, 
కొనసాగుతున్నవి.౪.స్త్రాటేజిక్గాకాశ్మీరు చాలా ముఖ్యమైనది. ౫.ఆర్టికల౭౭ ఇంకా కొంతకాలం కొనసాగిన్చాలిసివుంది. 
౬మన మిలిటరీని అవసరమైనంతకాలంఅక్కడ మొహరించివుంచాలిసిందే౭.కాశ్మీరీ పండిత్స్ని మంచి భద్రతతో అక్కడికి .   పునరావాసం
 కల్పించాలి. ౮.అరున్ధతీరాయి వంటివారిని దేసద్రోహనేరం కింద ప్రసేక్యూట్ చెయ్యాలి. ఇవి నా అభిప్రాయాలు. 
రమణారావు.ముద్దు (కమనీయం)

3, మే 2011, మంగళవారం

మెడి కేర్ ( గల్పిక)

గల్పికనం.౩==మెడికేర్ ----
                                      ఈ వైద్యరంగంలో ఎప్పుడూ ,ఎవరో ఒకరు ఒక కొత్త పరికరాన్నో ,పద్ధతినో కనిపెట్టుతూవుంటారు.మీకు ఆరోగ్యబీమా ఉంటె ఈ మెషీన్లను డాక్టర్లు వాడకున్దావుందరు. 
          ఈ మధ్య మిసెస్రత్నం  కడుపునొప్పితో మినర్వా హాస్పటల్కి వెళ్ళింది.ఏదో అసిదితీయో ,అజీర్నమో, సింపుల్గా బాగావుతున్దనుకొని వెళ్ళింది. ఇంచార్జి సీనియర్ డాక్టర్ మామూలుగా పరీక్షచేసి యాన్తాసిడ్ మాత్రలు 
          రాసిడ్డామనుకోనేసరికి ,జూనియర్ డాక్టర్ ,సార్మనహాస్పతల్కి దిన్గోమేషీన్వచ్చిన్దికదా ,దాన్ని వాడి చూస్తె మంచిదికదాఅని చెవిలో ఊదింది.
          "అవును,బాగా గుర్తుచేసావు .కడుపులో గ్యాసు వుంటే దానితో తెలిసిపోతుంది కదా .పెషేన్తుని ప్రేపేరు చేయడానికి ఎంత సమయం  పట్టుతుంది/"i
            
గంట పడుతుంది. రెడ్డిసార్ రాలేదు. డాక్టర్ మిశ్రాని అడిగితె రేపు రమ్మన్నారు." స్పెషల్ రిక్వెస్టు చేసి ఇవాళ ఎకామిదేట్ చెయ్యమని అడుగు.'
          దాక్తర్గారూ ఈపరీక్ష ఎందుకండీ నాకు మాత్రలు రాసివ్వండిచాలుఅంది మిసెస్ రత్నం.'''.అలా అనకమ్మా, మాడరన్ ఎక్విప్మెంట్ వాడడం నాధర్మం.లేకపోతె ఏ తుంటరి లాయరో కేసుపట్టవచ్చును. " 
         ఎలాగైతేనేమి రెండు గంటల తర్వాత మిసెస్ రత్నమ్కి దిన్గోస్కోపు పరీక్ష జరిగింది.ఆవిడకడుపు భాగం గుహలాంటి మేశీనులోకి దూర్చి ,కాళ్ళుచేతులు కట్టేశారు.నోరు తెరచి గాలి పీల్చమన్నారు. 
           ముక్కమన్నారు.పదిహేను నిమిషాలలో పూర్తయింది.దానితోబాటు రక్తపరీక్షలు అవీ చేసారు."నా ఇన్సూరెన్సు ఈ ఏడాదికి దీనితోనే పూర్తయిపోఎట్లు   వుంది"అని ఆవిడ గోల. పక్కనవున్న 
           నర్సు "ఊరుకోమ్మా, నీమంచికేకదా"అని మందలించేసరికిఆవిడ మారు మాతలాదలేకపోయింది 
            సీనియర్డాక్తర్చివరికి యాన్తాసిడ్ మాత్రలే రాసిచ్చాడువాటి ధర ౭౫రోపాయలె .కాని అన్ని పరీక్షలకి  ౨౦ వేలరూపాయలైంది.!

2, మే 2011, సోమవారం

telugu transliteration

ఇప్పుడు బ్లాగర్ లో transliteration సదుపాయం వచ్చింది. దీని వలన నా లాంటి వారికి చాల సులువుగా తెలుగు లో రాయడం కుడురుతింది. 

సాయి బాబా - 3

సత్యసాయిబాబా == నిరుడు ౨౦౧౦లొ బెంగుళూరులో ఉన్నప్పుడు ఎందుకో పుట్టపర్తికి వెళ్ళాలనిపించింది.మా అబ్బాయి వాళ్లతో కలిసి ,ముందు లేపాక్షి చూసి దగ్గరలోవున్న పుట్టపర్తి వెళ్ళాము. ప్రశాంతినిలయం ,అక్కడి వాతావరణం నచ్చాయి.హాస్పటల్ ,యూనివర్సిటీ బాగున్నవి.సాయంత్రం బాబా దర్సనం అయింది.అప్పటికే ఆయనకు పక్షవాతం వచ్చుటచేత వీల్చైర్లో చుట్టూ తిప్పి తీసుకోనివేల్లారు.ఆయన ఏమీ మాట్లాడలేదు. నా అభిప్రాయమేమంటే సత్యసాయిబాబా మహిమలు ,భగవంతుని అవతారమని నమ్మినా ,నమ్మకపోయినా ,ఆయన చేసిన,చేయించిన ప్రజోపయోగమైన అనేక ఘనకార్యాలను మనం ప్రసంసించాలి.ఆయనది సామాన్యకుటుంబంఆయన స్వంతడబ్బుతో కాకపోయినా కోట్లకొద్దీ ధనంఆయన ప్రభావంవలననే భక్తులు ఇచ్చారుఅందరికీ ఇస్తారా ?ఆయన నిర్యాణం తరవాత కూడా ప్రాజెక్టులన్నీ కొనసాగిస్తామని ట్రస్టు .వారుచెప్పారుకదా.వారు చెయ్యకపోతేనేప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. వేచిచూద్దాముఅంతేకాని కొందరు.చేస్తున్నట్లు నిందించడం తప్పు.నేను చూసినంతవరకూ సాయిసంఘాలు ప్రజాసేవ చేస్తున్నారు.నేను నిర్వహించిన నేత్రవైద్య శిబిరాల్లో సత్యసాయి సేవకులు స్వచ్చందంగా వచ్చి రోగులకు సేవచేసేవారు.==రమణారావు.ముద్దు .