ఎచటికి నీ ప్రయాణం-ఏల యీ ప్రయాస?
ఏది నీ గమ్యం-ఏమిటి నీ లక్ష్యం ?
చెట్లు పుట్టలు దాటి-చిట్టడవులు దాటి
కొండల్లో కోనల్లో -ఎండలలో వానలలో
రాజమార్గంలో కొంత -రమ్యహర్మ్యాలలో కొన్నాళ్ళు
ఆగుచూ,వెదకుచూ- అగమ్యమైన చోటికి
ఎచటికి నీ ప్రయాణం-ఏల యీ ప్రయాస ?
గమ్యంలేదు నా ప్రయాణానికి -కారణమేమో తెలియదు.
పయనమే నా లక్ష్యం -ప్రయాసయే నా విధి.
చీకటిలో ,చెలగే- జిలుగు వెలుగులలో
కష్టంలోను,సౌఖ్యం లోను,
చివరి మజిలీ దాకా - చెప్పనలవికాని నడకే
జీవిత పరమార్థం ,వేరే లక్ష్యం -చివరి గమ్యం లేని ప్రయాణం
మనకే తెలియదు మనమెందుకు పయనిస్తున్నామో
మానవచరిత్ర సమస్తం -మంచో చెడో పయనించడమే !
-------------
5 కామెంట్‌లు:
గమ్యమూ పరమార్ధమూ ఉన్నయి, కానలేకపోతున్నాం.
మంచో చెడో పయనించక తప్పని ప్రయాణం
మంచో చెడో పయనించక తప్పని ప్రయాణం
గమ్యం ఎటువైపైనా తప్పదు
చెట్లు పుట్టలు-చిట్టడవులు దాటి, కొండల్లో, కోనల్లో-ఎండలలో వానలలో .... రాజమార్గాల్లో-రమ్యహర్మ్యాలలో, ఆగుచూ, వెదకుచూ-జీవనం .... తెలియని ఏ గమ్యం వైపో పయనం? .... ఓ నేస్తమా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి