ఇప్పుడు సైంటిస్టు కావాలంటే మంచి యూనివర్శిటీలో చదవాలి.మంచి లేబొరేటరీలో పరిశోధనలు చెయ్యాలి.ఖరీదైన పరికరాలు ,ఇతరుల సహకారం అవసరం.కాని మొదట్లో సామాన్యుడైనవ్యక్తి తక్కువ పరిధిలో పరి శోధించి అపూర్వమైనవిషయాలు కనిపెట్టేవాడు.అలాంటివారిలో సమకాలికులైన 'లీవెన్ హోక్ ' (1632-1723) ,రాబర్ట్ హుక్ (1636-1703).ముఖ్యులు.16 వ శతాబ్దిలో జకారియా జాన్సెన్ అనే కంటి అద్దాలు తయారు చేసే వ్యక్తి సూక్ష్మదర్శినిగా పనిచేసే అద్దాలను కనుగొన్నాడు.వాటిని అభివృద్ధి చేసి లీవెన్ హాఓక్ microscope లను తయారుచేసి పరిశోధనలు చేసాడు.అతడు చిన్న వస్త్రవ్యాపారి.ఆ సూక్ష్మదర్శినులతో అతడు మొదట నిర్జీవపదార్థాలని తర్వాత సజీవపదార్థాలను పరిశీలించడం ప్రారంభించాడు. నీటిని,రక్తాన్ని,చర్మాన్ని,తన వీర్యాన్ని,ఉమ్మిని పరీక్షించాడు.ఆస్చర్యకరంగా వాటిలో వేలకొద్ది సజీవ సూక్ష్మ జీవులు కనిపించాయి.తన పరిశీలనాఫలితాలని ప్రచురించాడు.మొదట్లో ఇతర శాస్త్రజ్ఞులు నమ్మలేదు. తర్వాత అతని అహ్వానంతో స్వయంగా చూసి నమ్మారు.లండన్లోని రాయల్ సొసైటీ (Royal society of sciences ) అతనిని గౌరవించి,అతని పరిశోధనలని ప్రచురించేది.
రాబర్ట్ హుక్ గొప్ప సైంటిస్టు. ఎన్నో విషయాలు కనిపెట్టాడు.అతడు రచించిన మైక్రోగ్రాఫియా (micrograaphia) అనేగ్రంథం ప్రసిద్ధం ఐనది.దేహనిర్మాణం లో మూలమైన జీవకణాన్ని(cell) ని కనుగొని వర్ణించాడు. వీరిద్దరి కృషి ఫలితంగా వైద్యం,(Medicine ) , Biology) జీవశాస్త్రం ల అభివృద్ధి కి ఎంతగానో తోడ్పడినవి.