మన పురాణాల ప్రకారం ఆదిలో బ్రహ్మాండమంతా ఒక అండంలో సూక్ష్మరూపంలో ఉండేదని ,అది పగిలి విరజిమ్మబడి స్థూలరూపంలో మహావిశ్వం అయిందని,మళ్ళీ కోట్లసంవత్సరాల పిదప ఈ విధానం process పునరావృతం అవుతుందని చెప్పబడింది.ఇది చదువుతే నేటి సైన్సు చెప్పే 'బిగ్ బాంగ్ ' (bigbang) సిద్ధాంతాన్ని పోలివుంది.భౌతిక,ఖగోళ శాస్త్ర వేత్తలెవరైనా ఈ విషయం విశదీకరిస్తే సంతోషిస్తాను.దీనిపై చర్చకు ఆహ్వానిస్తున్నాను.
30, అక్టోబర్ 2013, బుధవారం
Big bang theory
మన పురాణాల ప్రకారం ఆదిలో బ్రహ్మాండమంతా ఒక అండంలో సూక్ష్మరూపంలో ఉండేదని ,అది పగిలి విరజిమ్మబడి స్థూలరూపంలో మహావిశ్వం అయిందని,మళ్ళీ కోట్లసంవత్సరాల పిదప ఈ విధానం process పునరావృతం అవుతుందని చెప్పబడింది.ఇది చదువుతే నేటి సైన్సు చెప్పే 'బిగ్ బాంగ్ ' (bigbang) సిద్ధాంతాన్ని పోలివుంది.భౌతిక,ఖగోళ శాస్త్ర వేత్తలెవరైనా ఈ విషయం విశదీకరిస్తే సంతోషిస్తాను.దీనిపై చర్చకు ఆహ్వానిస్తున్నాను.
21, అక్టోబర్ 2013, సోమవారం
మనమిప్పుడు ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యం ఎలా ఉండాలని ఒక concept పెట్టుకొంటామో, అలాగే పూర్వం ఆదర్శవంతమైన రాజరికం ఎల ఉండాలో ననే conceptఉండేది.మహాభారతంలో నారదముని ధర్మరాజు కి ఈ పరిపాలనావిషయాలు, రాజధర్మాల గురించి బోధిస్తాడు.వాటిని ఎందరు రాజులు ఆచరించేవారనేది వేరే సంగతి.ధర్మరాజు మాత్రం తనశక్తి కొలది వాటిని పాటిస్తున్నానని చెప్తాడు.ఆ సూత్రాలు కొన్ని ఈరోజు కూడా పరిపాలకులకు (ministers and highoffcials ) కి వర్తిస్తాయి.అవి ఏమిటంటే;-- 1.ఉత్తమ,మధ్యమ,అధమ,కార్యాలకి ఉత్తమ,మధ్యమ,అధమ వ్యక్తులను నియోగించాలి.2.ఉద్యోగులకు క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలి.3.రాజ్యం కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలను పోషించాలి.4.రాచకార్యాలకి లంచగొండులను,దొంగలను,దుర్జనులను నియోగించకూడదు.5.చెరువులు,ఇతర జలాశయాలను రక్షించాలి.6.రైతులకు విత్తనాలు సరఫరా చెయ్యాలి.7.వర్తకులకు వ్యాపారానికి అప్పులు ఇవ్వాలి.8.వికలాంగులను,వృద్ధులను పోషించాలి.9. ధనాగారములు,ఆయుధశాలలు ,భాండారాలు,దక్షత,నమ్మకం కలవారి చేతనే నిర్వహింపజేయాలి(treasuries,armouries ,stores) 10. గురువులు,వృద్ధులు,శిల్పులు,కళాకారులు,వర్తకులు(businessmen) ,సాధువులు,బంధువులు,ఆశ్రితులు ,వీరిని పేదరికము పొందకుండా కాపాడాలి.
మరినేటి పరిపాలకులు పై ధర్మాలు,సూత్రాలు ఎంతవరకు పాలిస్తున్నారో నిర్ణయించుకొనండి.చిట్టచివరి సూత్రాన్నిమాత్రం (బంధుజనులను,ఆశ్రితులను ) బాగానే పాటిస్తున్నట్లు ఉంది.
16, అక్టోబర్ 2013, బుధవారం
aarudra madhyakkaralu
ఆరుద్ర శుద్ధమధ్యాక్కరలు.;-ఆరుద్ర వ్యంగ్యానికి,హాస్యానికి,కొత్తప్రయోగాలకీ పెట్టిందిపేరు.విశ్వనాథవారికి 'మధ్యాక్కరలకి సాహిత్య అకాడమీ బహుమతి వచినప్పుడు ఆరుద్ర తన మధ్యాక్కరలనివ్రాసి ఆయనకే అంకితం ఇచ్చారు.ఆరుద్ర అభిప్రాయంప్రకారం పాడుకోడానికి పుట్టిన 'అక్కరలనీ జటిలమైన చందోవ్యాకరణాలతో పండితకవులు పద్యాలుగా మార్చేసారని.అందువలన సరళంగా తన శుద్ధ మధ్యాక్కరలు రచించారు.వాటి చందసుని తానే ఇలా నిర్వచించారు.'' పదమూడు మాత్రలున్నట్టి పాదార్థముల వళ్ళుపెట్టి ,తుదిప్రాసలందు నిలుపు,తూకాన అవి రెండు కలుపు.మొదలట్లు తొలిప్రాసవుంచి ముద్దుగా నాల్గాలపించు. '' ఉదాహరణకు మూడు రాస్తున్నాను.
'' ఆంధ్రలో రోడ్లన్న భయము--ఆఫ్రికా అడవులే నయము.
చాంద్రాయణము చేయు జనులు --- జపము విడిచిన మేటి మునులు
గంద్రగోళపు ఆటవిడుపు ---సంద్రపు ఘోష దిగదుడుపు
ఇంద్రుడైనా గుడ్డివాడు,--ఇచ్చోట తానడువలేడు.''
'' గేయమేముందుపుట్టింది --హాయిగా జాతి నవ్వింది.
వేయిపేరుల లక్షణమ్ము --వెనుకవచ్చిన దుప్పికొమ్ము.
తీయతీయని నాటుపాట --దేశీయసంపదల మూట
హేయమైనది పండితులకు --ఇల సంస్కృతపు హెచ్చుకొరకు. ''''
'' తనకు లేదని బాధకాదు-- తనవారికలిమిచేదు
తనివి తీరడమనుటలేదు --తనలోని చెడు దుగ్ధ పోదు.
కనబడని రోగమే ఈసు--- కాలకూటపు కంచు గ్లాసు
మునిగిపోయే పిచ్చివాడు--ముందు తీరము చేర లేడు
10, అక్టోబర్ 2013, గురువారం
ఇది పాత ప్రశ్నే.సమాధానం కూడా తెలిసిందే.కాని ఆచరణ లో విఫలం అవుతున్నది.మనిషికి కావలసిన సహజ అవసరాలు;1,తిండి,బట్ట,ఇల్లు.2.ఆరోగ్యం 3.విద్యావకాశాలు.4.శాంతి,భద్రత.గాంధీజీ చెప్పినట్లు.tere is enough for everyman's need but there is not enough for every man's greed.ఇందుకు కమ్యూనిజం పరిష్కారమని అనుకున్నారు కాని అది కూడా ఆచరణలో విఫలమైంది.అభిజ్ఞుల ప్రకారం పూర్తిగా కాకపోయినా ,చాలా వరకు ఈ ఆదర్శాలు స్కాండినేవియన్ దేశాలలో (స్వీడెన్,నార్వే,డెన్మార్క్) సఫలీకృతం ఔతున్నాయంటారు.
Baburnama
బాబర్నామా ,మొఘల్ సామ్రాజ్యస్థాపకుడు బాబర్ తన ఆత్మకథగా రాసుకొన్న పుస్తకం.మధ్య యుగాల చరిత్ర ,స్థితిగతులు దీనివలన యథాతథంగా తెలుస్తాయి.భారతదేశంలో అప్పుదున్న రాజ్యాలు,వాటి సైన్యాలు ,చేసిన యుద్ధాలే కాకుండా,భౌగోళికపరిస్థితులు,చరిత్ర వివరంగా తెలియజేసాడు.అంతేకాదు,మనదేశంలో వ్యవసాయం,మనుష్యుల కట్టుబొట్టు,ఆచారాలు,చెట్లు,జంతువులు,పక్షులు ప్రతీది సవిస్తరంగా కనిపెట్టి రాశాడు.తక్కువసైన్యంతో పెద్దసైన్యాలని ఓడించి ఎలా సామ్రాజ్యస్థాపన చేసాడో వర్ణించాడు.మన అనైక్యత,యుద్ధతంత్ర బలహీనతలు,ఏవిధంగా విదేశీ దండయాత్రలకు లోను కావలసివచ్చింది తెలుస్తుంది .మరొక్క ముఖ్యవిషయం; ఎన్ని రాజ్యాలుగా విడిపోయిఉన్నా సింధునదినుంచి అస్సాం వరకు,హిమాలయాలనుంచి హిందూమహాసముద్రం వరకు ఆనాడే భరత్ లేక హిందూస్తాన్ విస్తరించిఉన్నదనే అవగాహన ఉన్నట్లు ఈ గ్రంథం ద్వారా తెలుస్తుంది.జిజ్ఞాసువులందరూ తప్పక చదవవలసిన పుస్తకం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)