రెండు విషయాలు వ్రాయదలచుకొన్నాను.
1.ఇటీవల పాఠశాలలో తెలుగు నిర్బంధంగా ఒక సబ్జెక్టు గా ,ప్రైవేటు స్కూళ్ళతో సహా విద్యార్థులు చదవాలని ప్రభుత్వం తీసుకూన్న నిర్ణయం.2.ప్రైవేటు సంస్థలతో సహా ,అన్ని నామఫలకాలమీద(name boards) తెలుగులో రాయాలన్న నిర్ణయం,నిర్బంధం చేయడం.కర్ణాటక,తమిళ్నాడుల్లో ఈ నిబంధనలు ఇప్పటికే అమలు చేస్తూ ఉన్నారు.3.రద్దు చేయబడిన అకాడమీలను పునరుద్ధరిస్తామని వాగ్దానం చేయడం.దీనిని తప్పక అమలుపరుస్తారని ఆశిద్దాము.ముఖ్యమంత్రిగారినీ,బుద్ధప్రసాద్ గారినీ అభినందించాలి.
రెండవ విషయం.పాకిస్తాన్ వలె ( అంత మూర్ఖంగాను,హింసాత్మకంగాను కాకపోయినా ) మనదేశంలో కూడా moral policing ఎక్కువైంది.వ్యక్తుల వేషభాషలు,ఆహారవిహారాలు,అలవాట్లు,సంబంధాలు విషయంలో కలుగజేసుకోకూడదు.ఇతరులకు హాని కలిగించనంతవరకు,వ్యక్తి స్వేచ్చకు ఆటంకం ఉండకూడదు.ప్రత్యేకమైన,బలవత్తరమైన కారణాలు ఉంటేనే ,ప్రభుత్వం మాత్రమే కలుగ జేసుకోవచ్చును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి