22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

terrorism-long struggle.




  పరస్పర నిందారోపణలకిది సమయం కాదు.ప్రతి అధికారి,మంత్రి  బధ్యత తమది కాదన్నట్లు మాట్లాడుతారు.కృతనిశ్చయంతోను, ఐకమత్యంతోను  ప్రభుత్వమూ.ప్రజలూ ఉగ్రవాదం పై పోరాడాలి.ఒకో సారి విఫలం కావచ్చును.ప్రమాదసూచనలు పంపడంతో మాత్రమే కేద్రం బాధ్యత తీరిపోదు.ఉగ్రవాద సెల్స్ పై నిఘా పెట్టి అనుమానితులను ముందే ప్రత్యేక చట్టాలద్వారా అరెస్టు చెయ్యాలి.హైదరాబాదు వంటి మహానగరం లో జనసమ్మర్దం ఉండే స్థలాలు చాలా ఉంటాయి కదా.
  పాకీస్తాను,ఇస్లమిక్ ఉగ్రవాదసంస్థలూ భారత్ని నాశనం చెయ్యడానికి,లేక,సాధ్యమైనంత హింస ,కల్లోలం రేకెత్తించడానికి ,నిత్ణయించుకొన్నవన్నది  బహిరంగసత్యమే.ప్రత్యక్షయుద్ధం ద్వారా భారత్ ను జయించలేమని వాళ్ళకి  తెలుసును.అందుకే ఈ పరోక్ష చర్యలు.ఇది దీర్ఘకాల పోరాటమని  మనం సిద్ధపడాలి.
  కొందరు మంత్రులు నోరు మూసుకుంటేనే మంచిది.నా అభిప్రాయంలో  కేంద్రంలో షిండే,రాష్ట్రంలో సబితారెడ్డి హోం శాఖ మంత్రులు గా పనికి రారు. వారిని మార్చి ఇంకా సమర్థులను నియమించవలసి ఉంది.U.P.A. ప్రభుత్వం vote bank  రాజకీయాలు మాని ఇస్లామిక్ ఉగ్రవాదం ని ఉక్కుపాదంతో అణచివెయ్యాలి.   

16, ఫిబ్రవరి 2013, శనివారం



 

 రెండు విషయాలు వ్రాయదలచుకొన్నాను.
  1.ఇటీవల పాఠశాలలో తెలుగు నిర్బంధంగా ఒక సబ్జెక్టు గా ,ప్రైవేటు స్కూళ్ళతో సహా విద్యార్థులు చదవాలని ప్రభుత్వం తీసుకూన్న నిర్ణయం.2.ప్రైవేటు సంస్థలతో సహా ,అన్ని నామఫలకాలమీద(name boards) తెలుగులో రాయాలన్న నిర్ణయం,నిర్బంధం చేయడం.కర్ణాటక,తమిళ్నాడుల్లో ఈ నిబంధనలు ఇప్పటికే అమలు చేస్తూ ఉన్నారు.3.రద్దు చేయబడిన అకాడమీలను పునరుద్ధరిస్తామని వాగ్దానం చేయడం.దీనిని తప్పక అమలుపరుస్తారని ఆశిద్దాము.ముఖ్యమంత్రిగారినీ,బుద్ధప్రసాద్ గారినీ అభినందించాలి.

  రెండవ విషయం.పాకిస్తాన్ వలె  ( అంత మూర్ఖంగాను,హింసాత్మకంగాను కాకపోయినా ) మనదేశంలో కూడా moral policing  ఎక్కువైంది.వ్యక్తుల వేషభాషలు,ఆహారవిహారాలు,అలవాట్లు,సంబంధాలు విషయంలో కలుగజేసుకోకూడదు.ఇతరులకు హాని కలిగించనంతవరకు,వ్యక్తి స్వేచ్చకు ఆటంకం ఉండకూడదు.ప్రత్యేకమైన,బలవత్తరమైన కారణాలు ఉంటేనే ,ప్రభుత్వం మాత్రమే కలుగ జేసుకోవచ్చును. 

3, ఫిబ్రవరి 2013, ఆదివారం

Blaagarloo, bahuparaak.



 


  బహు పరాక్!రచయితలూ,రాజకీయులూ,సినిమా వాళ్ళూ,ఉపన్యాసకులూ,ఆఖరికి బ్లాగులు రాసేవాళ్ళు కూడా జాగ్రత్త.లేకపోతే చిక్కుల్లో ఇరుక్కుంటారు.రాజకీయనాయకులకీ,సినిమా వాళ్ళకీ అంత పరవా లేదు.వాళ్ళకి ధనబలమూ,జనబలమూ ఉంటాయి.రాజకీయనాయకులకు జైలుకి వెళ్ళడం ఒక క్రెడిట్  కూడాను.కోర్టులకి వెళ్ళడం వాళ్ళకి అలవాటే.కాని మన poor blog  writers మాత్రం జాగ్రతగా ఉండాలి.ఎప్పుడు ఏది రాస్తే ఎవరికి  కోపం వస్తుందో చెప్పలేము.స్వతంత్ర భారతదేశంలో ,ప్రజాస్వామ్యంలో రచనా స్వాతంత్ర్యం  ఉందని ఇష్టం  వచ్చినట్లు రాయకండి.కులం,మతం,భాష,వర్గం,ప్రాంతం ,మనోభావాలూ' అన్నీ జాగ్రతగా చూసుకోవాలి.పోలీసులు పట్టికెళ్ళకపోయినా ,కనీసం తిట్లూ, శాపనార్థాలూ మాత్రం తప్పవు.అంచేత  బహుపరాక్!