17, ఫిబ్రవరి 2015, మంగళవారం

mahabharatam




 ఇదండీ భారతం 'గురించి రంగనాయకమ్మగారి ఇంటర్వ్యూ టీ.వీ. 9 లో చదివాను.ఆవిడ ,ఆమె మిత్రులు ఈ మధ్యనే భారతాన్ని చదివినట్లుంది.ఆవిడ చెప్పిందానిలో  నాకు కొత్త ఏమీ కనిపించలేదు.ఇప్పటికే ఎందరో పరిశోధకులు ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించి  రాసారు.ప్రపంచ  క్లాసిక్స్ లో ఒక ముఖ్యమైన  గ్రంథంగా పండితులు పరిగణించేదానిలో ఆవిడకు మెరిటేమీ కనిపించకపోవడం విచిత్రమే. మనం గుర్తించవలసిన ముఖ్యమైన విషయాలు ఇవి.1.దాదాపు 4000 సం; క్రితం రాజ్యం  కోసం  జరిగిన పెద్ద యుద్ధం  ఇందులో మూలకథ.వ్యాసుడి interpretation లో పక్షపాతం ఉండవచ్చును కాని కథాంశాలు,పాత్రల చిత్రీకరణలో ఏదీ దాచలేదు.2.అప్పటి వ్యవస్థ ఫ్యూడల్ వ్యవస్థ.రాజులు,రాజ్యాల కోసం యుద్ధాలు మామూలే.వర్ణ వ్యవస్థ కూడవాస్తవమే.మనం ఆపరిధిలోనే ఆలోచించాలి.3.రంగనాయకమ్మగారు బోధించే  మార్క్సిజం ఏమైంది?అన్నిచోట్లా విఫలమైంది కదా?4.నాకు మహాభారతంలోనచ్చిన విషయాలు;ధర్మాధర్మాల గురించి,యుద్ధము,శాంతి గురించి వాదోపవాదాలు,చర్చలు.అవి ఈ రోజుల్లో కూడా అన్వయిస్తాయి కదా.అలాగే ఆసక్తి కరమైన  పెద్ద కథ,వివిధ మనస్తత్వాల చిత్రణ కూడా ఆకర్షిస్తుంది.

13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

Dr.Kesavareddi.




 డాక్టర్ కేశవరెడ్డి గారి మరణ వార్త చదివి బాధపడ్డాను.ఆయనతో నాకు  పరిచయం లేకపోయినా, ఆయన నవలలు కొన్ని చదివాను.ప్రసిద్ధ రచయిత.''ఇంక్రెడిబుల్ గాడెస్  ',రాముడున్నాడు రాజ్యమున్నాది ' వంటి నవలలు రచించారు.ఆయన నవల 'అతడు అడవిని జయించాడు '  హెమింగ్వే నవల ' oldman and sea  'కి అనుకరణ.'మునెమ్మ ' నవల కూడా కొన్ని విమర్శలకు గురయింది.ఆయన నవలలన్నీ   పల్లెటూళ్ళ వాతావరణం  తో అతి సామాన్యుల జీవితాలకి అద్దం పడతాయి.
    వైద్యునిగా కూడా కుష్టు  రోగులకు ఆయన చేసిన సేవలు స్మరణీయమైనవి .నా సంతాపాన్ని ఈ విధంగా తెలియ జేసుకొంటున్నాను.