నా మిత్రులు కీ.శే.రామిశెట్టి వెంకట్రావు ఎంతో శ్రమించి ,చాలా కాలం సమాచారాన్ని సేకరించి రచించిన గ్రంథం '' ఉత్తరాంధ్ర స్ఫూర్తిప్రదాతలు ''.దీనిని రచించిన కొద్ది కాలానికే దురదృష్టవశాన జబ్బుచేసి ఆయన మరణించారు.'ధర్మాన ట్రస్స్టు వారు ముందుకివచ్చి ఈ పుస్తకాన్ని ప్రచురించారు.ఘనంగా శ్రీకాకుళంలో ఆవిష్కరణ కూడా చేయించారు.
నేను మరల ఈ పుస్తకాన్నే విశాఖ సాహితీ అధ్వర్యంలో వైజాగ్లో విశాఖపౌరగ్రంథాలయంలో (ద్వారకానగర్) ఆవిష్కరణ చేయించాను.
ఈ గ్రంథంలో 108 మంది ,విశాఖ,విజయనగరం, శ్రీకాకుళం,పాత గంజాం జిల్లాలకి చెందిన ప్రసిద్ధులు,మహనీయులు,వివిధరంగాలలో మార్గదర్శకులైన వారి జీవిత విశేషాలను ప్రచురించారు.ఇందులో ప్రసిద్దులైన కవులు,రచయితలు,జర్నలిస్టులు,రాజకీయనాయకులు,సంఘసంస్కర్తలు,విప్లవవీరులు,గాయకులు,డాక్టర్లు,సైంటిస్టులు,మొదలైన అన్నిరంగాలకూ చెందినవారిని చేర్చడమైనది.ఇది మంచి రిఫరెన్సు పుస్తకంగా వ్యక్తులదగ్గర,పరిశోధకులదగ్గర, గ్రంథాలయాల్లోను ఉండవలసిన పుస్తకం.
ప్రతులకు;-- రామిశెట్టి.భాగ్యరేఖ
డోర్ నం. 2-15-56
ఇల్లిస్ పురం వీధి
శ్రీకాకుళం.-532001 (ఏ.పి.)
--------
సెల్.నం. 9441707772