ఎమిలీబ్రాంటి =బ్రాంటీ సోదరీమణుల్లో రెండవది.ముగ్గురూ రచయిత్రులే.
జననం;1818;మరణం;1848.
ఆ రోజుల్లో ఇంగ్లాండ్ వంటి దేశాల్లో క్షయ వ్యాధి ఎక్కువగా ఉండేది.కీట్స్ ,వర్జీనియావుల్ఫ్ ఆ వ్యాధి తోనే మరణించారు.ఎమిలీ కూడా చిన్నవయసులోనే క్షయతో మరణించింది.ఆమె రచించిన ' వుదరింగ్ హైట్స్ ' అనే నవల ప్రసిద్ధమైనది.ఇతర రచనలు అంతగా లభ్యం కాలేదు.జేన్ ఆస్టిన్ నవలల తర్వాత అంత ప్రసిద్ధమైన నవలా(స్త్రీలు రచించినవి )లేదు.ఇప్పటికీ పాఠకులు ఇస్టపడేది.
ఐతే ఈ నవలలో విశిష్టత ఏమిటి?తమ యింట్లో పెరిగిన జిప్సీ కుర్రవానికీ, యింటి యజమాని కూతురికీ ప్రణయం ప్రధానాంశం.ఆ యజమాని కొడుకుకీ జిప్సీ కుర్రవానికీ మధ్య వైరం మరొక ముఖ్యమైన అంశం.కేథరిన్ ఎర్న్ షా (హీరోయిన్ ) హీథ్ క్లిఫ్ (జిప్సీ) ప్రేమ సఫలం కాదు.కేథరిన్ ఇంకొకరిని వివాహం చేసుకుంటుంది.ఈ నవలలో ఎవరూ ఉన్నతమైన ,ఉదారమైన భావాలు,ప్రవర్తన కలిగి వుండరు.పగ,అసూయ,వైరం ఎక్కువగా కనిపిస్తాయి.ఐతే తీవ్రమైన భావోద్వేగాలు,ఆవేశాలు,తీవ్రవాంచలు,(passions) ఎక్కువగా నవలలో ఆవహించి ఉంటాయి.బహుశా అవే ఈ నవలకి ఆకర్షణలు అయివుంటాయి.
ఈ నవలని పలువిధాలుగా రివ్యూ చెసారు.విమర్శించారు.మార్క్సిస్టు దృక్పథం తో ,స్త్రీవాద దృక్పథంతో సమీక్షించారు.మనస్తత్వ పరిశీలనతో పరిశోధించారు.కాని ఏకాభిప్రాయం రాలేదు.మానవుల్లోని చీకటికోణాలని చూపించేనవల అంటారు.మీరే చదివి అభిప్రాయం ఏర్పరచుకొండి.నేను మొదటిసారి విద్యార్థి దశలో చదివాను. బాగా అర్థం కాలేదు.రెండోసారి చదివినప్పుడు అర్థం చేసుకొన్నాను,It is a dark novel.